బిగ్ బ్రేకింగ్ : రేపు ఏపీ సీఎం చంద్రబాబుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ?

nanireddy
Updated on: 24 Dec 2018 2:51 PM IST
బిగ్ బ్రేకింగ్ : రేపు ఏపీ సీఎం చంద్రబాబుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ?
X

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వ్యూహాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పొత్తులపై వివిధ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. అందులో భాగంగా రేపు(శనివారం) టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని ఇదివరకే వార్తలు వచ్చిన నేపథ్యంలో రేపు చంద్రబాబుతో.. ఉత్తమ్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదివరకే టీడీపీతో తాము పొత్తులకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఇక తెలంగాణ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు చంద్రబాబునాయుడు శనివారం హైదరాబాద్ రానున్నారు.

nanireddy

nanireddy

Next Story