టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

nanireddy
Updated on: 24 Dec 2018 2:06 PM IST
టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
X

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత కోటిపల్లి రాఘవ(105) మృతిచెందారు. గతకొంత కాలంగా వయసురీత్యా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న రాఘవ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామానికి చెందిన అయన ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌ అనే బ్యానర్ స్థాపించి 30కి పైగా సినిమాలను నిర్మించారు. తరంగిణి, తూర్పు పడమర వంటి చిత్రాలతో పాటు.. ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1972లో తాతమనవడు చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాతోనే దాసరి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తఱువాత 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు సైతం అందుకున్నారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావుగోపాల్‌రావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, ఎస్పీ బాలు, సుమన్‌, భానుచందర్‌లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

nanireddy

nanireddy

Next Story