రాహుల్ గాంధీని కలిసిన బండ్ల గణేష్.. అందుకోసమే..

nanireddy
Updated on: 24 Dec 2018 1:46 PM IST
రాహుల్ గాంధీని కలిసిన బండ్ల గణేష్.. అందుకోసమే..
X

నటుడు, నిర్మాత.. బండ్ల గణేష్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. మొన్న (మంగళవారం) రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు బండ్ల గణేష్ ట్విట్టర్ లో ఫోటోని పోస్ట్ చేసి 'ఇలాంటి జ‌న్మ‌దినోత్స‌వాలు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను స‌ర్‌. మీరే దేశ భ‌విష్య‌త్తు. దేవుడు మిమ్మ‌ల్ని చల్లగా చూడాలి' అంటూ పేర్కొన్నాడు. కాగా బండ్ల గణేష్ రాహుల్ గాంధీని కలవడంపై మరో విధంగా రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. అయన రాహుల్ గాంధీతో సాన్నిహిత్యం కోసమే కలిశారని సోషల్ మీడియాలో కామెంట్లు దర్శనమిస్తున్నాయి.

nanireddy

nanireddy

Next Story