జగన్ ను కలిసిన టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత

nanireddy
Updated on: 24 Dec 2018 3:09 PM IST
జగన్ ను కలిసిన టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత
X

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 272వ రోజైన బుధవారం ఎల్‌కోట మండలంలో ప్రవేశించింది. బుదవారం జగన్ పాదయాత్రకు సంకీభావం తెలిపారు నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఎల్‌కోట మండలంలో వారిద్దరూ జగన్ ను కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కొద్ది దూరం జగన్ తో కలిసి పాదయాత్ర చేశారు. అడుగడుగునా భారీ జనసందోహం మధ్య అయన పాదయాత్ర సాగుతోంది. ఇప్పటికే జగన్ 11 జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు జగన్. ప్రస్తుతం అయన 12 జిల్లా విజయనగరంలో అడుగుపెట్టారు. జిల్లాలో జగన్ యాత్రను సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెనుమత్స సాంబశివరాజు జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story