టాలీవుడ్‌ లో విషాదం.. వినోద్‌ ఇకలేరు

nanireddy
Updated on: 24 Dec 2018 1:58 PM IST
టాలీవుడ్‌ లో విషాదం.. వినోద్‌ ఇకలేరు
X

టాలీవుడ్‌ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు వినోద్‌(అరిసెట్టి నాగేశ్వర రావు) మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. వినోద్‌ 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. 30 తమిళ సినిమాలు, నాలుగు హిందీ సినిమాలతోపాటూ పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు.

nanireddy

nanireddy

Next Story