మూడేళ్లు వ‌రుస‌గా..

మూడేళ్లు వ‌రుస‌గా..
x
Highlights

ఈ త‌రం ద‌ర్శ‌కులు మూడేళ్ల పాటు వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం అనేది అరుదైన విష‌యంగా మారిపోయింది. అయితే, ఓ యువ ద‌ర్శ‌కుడు మాత్రం స‌క్సెస్‌ఫుల్‌గా మూడేళ్ల...

ఈ త‌రం ద‌ర్శ‌కులు మూడేళ్ల పాటు వ‌రుస‌గా సినిమాలు చేయ‌డం అనేది అరుదైన విష‌యంగా మారిపోయింది. అయితే, ఓ యువ ద‌ర్శ‌కుడు మాత్రం స‌క్సెస్‌ఫుల్‌గా మూడేళ్ల పాటు ప్ర‌తి సంవ‌త్స‌రం త‌న నుంచి ఓ సినిమా ఉండేలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ యువ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు.. 'పటాస్‌', 'సుప్రీమ్‌'తో వ‌రుస విజ‌యాలు అందుకున్న అనిల్ రావిపూడి.

2015లో 'ప‌టాస్' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన అనిల్‌.. 2016లో 'సుప్రీమ్‌'తో ద్వితీయ విఘ్నాన్ని అవ‌లీల‌గా అధిగ‌మించేశాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో 'రాజా ది గ్రేట్' చేస్తున్నాడు. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 12న ఈ చిత్రం రానుంది. అంటే.. వ‌రుస‌గా మూడేళ్ల పాటు.. ప్ర‌తి సంవ‌త్స‌రం త‌న సినిమా ఉండేలా అనిల్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడ‌న్న‌మాట‌. భ‌విష్య‌త్‌లోనూ అనిల్ ఇలాగే ప్ర‌తి సంవ‌త్స‌రం సినిమాలు చేస్తూ ముందుకెళ్లాల‌ని ఆకాంక్షిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories