ఆడా ఉంటా.. ఈడా ఉంటా

ఆడా ఉంటా.. ఈడా ఉంటా
x
Highlights

టీఆర్ఎస్ రాజ్యసభ్య అభ్యర్థులను ప్రకటించారు. బీసీలకు పెద్ద పీట వేశారు. ఇక TRSLP భేటీ వేదికగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో...

టీఆర్ఎస్ రాజ్యసభ్య అభ్యర్థులను ప్రకటించారు. బీసీలకు పెద్ద పీట వేశారు. ఇక TRSLP భేటీ వేదికగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఉండాల్పిందేనన్న కేసీఆర్ తాను తెలంగాణలో ఉండే ఢిల్లీ రాజకీయాలు చేస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లిస్తానని భరోసా ఇచ్చారు.

రాజ్యసభ అభ్యర్థుల ఉత్కంఠకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెరదించారు. సోమవారం నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు కావటంతో అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ పేరును ఖరారు చేసిన కేసీఆర్ బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. నల్గొండ జిల్లా నేత బడుగుల లింగయ్య యాదవ్, వరంగల్ జిల్లాకు చెందిన బండ ప్రకాష్ ముదిరాజ్ లకు రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. సంతోష్ కుమార్ అగ్ర కులస్తుడు కాగా మిగతా ఇద్దరూ వెనకబడిన వర్గాలకు చెందిన వారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎల్సీ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 106 , 107 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆయన..2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. తాను ఢిల్లీ వెళ్ళబోనని తెలంగాణలో ఉండే జాతీయ రాజకీయాలు నడిపిస్తానని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత రిజర్వేషన్ల్ ఫై ఢిల్లీలో ధర్నాకు యోచిస్తున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రజాప్రతినిధులంతా తప్పక హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories