పరారీలో విజయ్‌సాయి భార్య వనిత

lakshman
Updated on: 24 Dec 2018 12:22 PM IST
పరారీలో విజయ్‌సాయి భార్య వనిత
X

సినీ నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసు నిందితుల కోసం వేట కొనసాగుతోంది. విజయ్‌సాయి తండ్రి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు విజయ్‌సాయి భార్య వనిత, న్యాయవాది శ్రీనివాస్, శశిధర్‌పై కేసు నమోదు చేశారు. తన ఆత్మహత్యకు వనిత, శ్రీనివాస్, శశిధరే కారణమని విజయ్ సాయి సె‌ల్ఫీ వీడియోల్లో చెప్పడంతో వీరి ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. దీంతో వనిత, శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు నిన్న యత్నించారు. వనిత ఇంటికి పోలీసులు వెళ్లగా తాను సిద్ధిపేటలో ఉన్నానని ..తానే వచ్చి లొంగిపోతానంటూ హైడ్రామా నడిపింది. అయితే వనిత ఫోన్ సిగ్నల్ మాత్రం రాజేంద్ర నగర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..ఆమె కోసం వేట కొనసాగిస్తున్నారు. వనితను ఏ నిమిషంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

lakshman

lakshman

Next Story