Top
logo

తెలంగాణ వెదర్ యాప్.. రాబోయే 3 రోజులు..

తెలంగాణ వెదర్ యాప్.. రాబోయే 3 రోజులు..
X
Highlights

తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాతావరణాన్ని తెలుసుకునేందుకు TS వెదర్ యాప్ ను...

తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాతావరణాన్ని తెలుసుకునేందుకు TS వెదర్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌ఐసీ సహకారంతో తెలంగాణ ప్రణాళికాభివృద్ధి సంస్థ ఈ యాప్ ను రూపొందించింది. వాతావరణ యాప్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వాతావరణ వివరాలు తెలుసుకునేలా యాప్‌ను రూపొందించామన్నారు.ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 863 వాతావరణ స్టేషన్ల సహకారంతో పని చేస్తుంది. రాబోయే 3 రోజుల వాతావరణ సమాచారం సైతం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి TS వెదర్ యాప్ అని టైప్ చేసి ఈ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

Next Story