Top
logo

కోదండకు ఎసరు పెడుతున్న నేత ఎవరు?

కోదండకు ఎసరు పెడుతున్న నేత ఎవరు?
X
Highlights

తెలంగాణలో కొత్తగా ఆవిర్భవించిన పార్టీలోని...అధ్యక్ష పదవికి ఎవరు ఎసరు పెట్టారు ? పార్టీలో చేరాలని...

తెలంగాణలో కొత్తగా ఆవిర్భవించిన పార్టీలోని...అధ్యక్ష పదవికి ఎవరు ఎసరు పెట్టారు ? పార్టీలో చేరాలని ఆహ్వానించడానికి వెళితే అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని డిమాండ్ చేసిందెవరు ? ఈ ప్రతిపాదనతో కొత్త పార్టీ నేతలే షాకయ్యారా ? తనకే ఎసరు పెడుతున్నారని సైలెంట్‌గా వచ్చిన పార్టీ నేత ఎవరు ?

తెలంగాణ జన సమితి...ఇటీవల పురుడు పోసుకున్న రాజకీయ పార్టీ. జేఏసీ పార్టీగా అవతరించడానికి ముందుకు అనేక కసరత్తులు చేసిన తర్వాత పార్టీని ఏర్పాటు చేశారు కోదండరాం. పార్టీని స్థాపించిన తర్వాత రాష్ట్రంలో సంచలనం సృష్టించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అన్ని పార్టీల నేతలను తెలంగాణ జన సమితిలోకి చేర్చుకొని షాకిచ్చేందుకు...స్వయంగా కోదండరామే రంగంలోకి దిగారు. అధికార పార్టీ నేతలు టీజేఎస్‌లో చేరే అవకాశం లేకపోవడంతో...కాంగ్రెస్‌, బీజేపీల్లో అసంతృప్తితో ఉన్న నేతలపై కన్నేశారు. అందులో భాగంగా కాంగ్రెస్‌ నేతలు పలువురు కోదండరాంతో చర్చలు జరిపారు.

కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని...పార్టీలో చేరాలని కోదండరాం ప్రయత్నాలు ప్రారంభించారు. రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదనతో కోదండరాం షాక్‌ తిన్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో చేరితే వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవి ఇస్తామని టీజేఎస్‌ నేతలు ప్రతిపాదిస్తే...రాజగోపాల్‌రెడ్డి అధ్యక్ష పదవి డిమాండ్ చేసినట్లు సమాచారం. ఎంపీగా, ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉందని చెప్పినట్లు సమాచారం. తనకు అధ్యక్ష పదవి ఇచ్చి...కోదండరాం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగాలని రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదనతో తెలంగాణ జన సమితి నేతలు షాక్ తిన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇంటి పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. కోదండరామ్ సామాజిక న్యాయానికి కట్టుబడకుండా తన చుట్టే అధికారం ఉండే విధంగా వ్యవహరిస్తున్నారని చెరుకు సుధాకర్‌ ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి షాకివ్వడంతో....ఇతరులో చర్చలు జరిపే ముందే...పదవులపై కోదండరాం ఆరా తీస్తున్నారు. ఇదేం ప్రతిపాదనంటూ...తెలంగాణ జన సమితి నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Next Story