తెలంగాణ మరో సూపర్ రికార్డు

తెలంగాణ మరో సూపర్ రికార్డు
x
Highlights

తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. ఆదాయాభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి నాలుగేళ్లలో...

తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. ఆదాయాభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి నాలుగేళ్లలో 17.2 వృద్ధిరేటును సాధించి మిగతా రాష్ట్రాలను వెనక్కి నెట్టింది. తెలంగాణ రాష్ట్రం మరో సూపర్‌ రికార్డు సాధించింది. ఆదాయాభివృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మొత్తం నాలుగేళ్లలో సగటున 17.2 వృద్ధిరేటును సాధించి దూసుకుపోతోంది. నిర్మాణాత్మక అభివృద్ధి పనులు, రాబడి పెంపకానికి తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఆర్థిక వృద్ధి రేటు ఊహించని విధంగా పెరిగింది.

స్టేట్‌ ఓన్‌ ట్యాక్స్‌ రెవెన్యూలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కాగ్‌ ప్రకటించింది. నాలుగేళ్ల కాలంలో సగటున 17.2 శాతం వృద్ధి రేటు సాధించిన తెలంగాణ 2015–16లో 13.7 శాతం, 2016–17లో 21.1 శాతం, 2017–18లో 16.8 శాతం వృద్ధిరేటు సాధించి మిగతా 28 రాష్ట్రాలను వెనక్కి నెట్టింది. ఇక 14.2శాతంతో హర్యానా రెండో స్థానంలో నిలవగా, 13.9శాతంతో మహారాష్ట్ర మూడో స్థానంలో, 12.4శాతంతో ఒడిషా నాలుగో స్థానం, 10.3శాతంతో బెంగాల్‌ ఐదో స్థానంలో నిలిచాయి. ఇక మిగతా రాష్ట్రాలన్నీ 10శాతంలోపే వృద్ధిరేటు నమోదు చేశాయి.

రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపులో ప్రజలు చూపిస్తున్న చిత్తశుద్ధితోనే ఆదాయాభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాల తర్వాత కూడా రాష్ట్రం సుస్థిరమైన ఆదాయాభివృద్ధితో పురోగమించటం శుభసూచకమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా అమలు చేసుకోవడానికి ఆదాయాభివృద్ధి ఎంతో దోహదపడుతుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆర్ధికావృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ అతి తక్కువ సమయంలోనే ఆర్ధిక సత్తాను చాటుతూ ధనిక రాష్ట్రంగా రికార్డులకెక్కింది. కాగ్ నివేదిక ప్రకారం తొలి ఏడాదిలోనే సొంత రాబడుల్లో గణనీయమైన ప్రగతిని సాధించిన తెలంగాణ ఈ నాలుగేళ్లలో ఎన్నో ప్రతిబంధకాలు, సవాళ్లను అధిగమించి తనకు ఏ రాష్ట్రం సాటిలేదని తెలంగాణ నిరూపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories