మంత్రివర్గ సమావేశం వాయిదా.. మంత్రులంతా అక్కడే ఉండండి : సీఎం

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
మంత్రివర్గ సమావేశం వాయిదా.. మంత్రులంతా అక్కడే ఉండండి : సీఎం
X

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. ఇవాళ జరగాల్సిన కేబినెట్‌ భేటీని వాయిదా వేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మంత్రులంతా జిల్లాల్లోనే ఉండి సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కూడా రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నీటిమట్టం పెరుగుతోంది. కాళేశ్వరం పుష్కరఘాట్ మెట్ల వరకు నీటిమట్టం చేరుకుంది.

nanireddy

nanireddy

Next Story