ప్రపంచ రికార్డ్ సృష్టించిన టీమిండియా

lakshman
Updated on: 24 Dec 2018 12:23 PM IST
ప్రపంచ రికార్డ్ సృష్టించిన టీమిండియా
X

రెండుసార్లు ప్రపంచ చాంపియన్ టీమిండియా....ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మొహాలీ వేదికగా శ్రీలంకతో ముగిసిన రెండోవన్డేలో...4 వికెట్లకు 392 పరుగుల భారీస్కోరు సాధించడం ద్వారా...వన్డే క్రికెట్ చరిత్రలోనే వందసార్లు.. 300కు పైగా స్కోర్లు.... సాధించిన తొలిజట్టుగా నిలిచింది. స్వదేశీ సిరీస్ ల్లో 46సార్లు 300కు పైగా స్కోర్లు సాధించిన టీమిండియా...స్వదేశం వెలుపల జరిగిన మ్యాచ్ ల్లో56 సార్లు 300 స్కోర్ల రికార్డు నమోదు చేసింది. అంతేకాదు...శ్రీలంక ప్రత్యర్థిగా టీమిండియా 21సార్లు 300కు పైగా స్కోర్లు సాధించడం మరో ఘనతగా మిగిలిపోతుంది.


lakshman

lakshman

Next Story