ఎన్డీయే సర్కార్ అవిశ్వాసానికి ఒక్కటైన పార్టీలు

రాజకీయం రసవత్తరఘట్టానికి చేరుతోంది. విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఏంటన్న ప్రశ్న నుంచి... స్తబ్దుగా సాగుతున్న...
రాజకీయం రసవత్తరఘట్టానికి చేరుతోంది. విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఏంటన్న ప్రశ్న నుంచి... స్తబ్దుగా సాగుతున్న పాలిటిక్స్ అంతకంతకూ హీట్ పెంచేస్తున్నాయి. రాజకీయంలో చలనం... సంచలనం ఒకేసారి రావడంతో తెలుగు రాష్ట్రాలు సోమవారం ఏం జరగబోతోందా? అన్న ఆసక్తిగా చూస్తున్నాయి.
క్షణక్షణానికి మారుతున్న రాజకీయం..ఎన్డీయే సర్కార్ అవిశ్వాసానికి ఒక్కటైన పార్టీలు..వాయిదా తీర్మానాల నుంచి... అవిశ్వాసం వైపు అడుగులు..వైసీపీ నోటీసులు, టీడీపీ హెచ్చరికలు, ఎన్డీయేతర పార్టీల హుంకరింపులు.. ఇలా ఢిల్లీలో రాజకీయం క్షణం క్షణం మారుతోంది. వైసీపీ టీడీపీ వాయిదా తీర్మానాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ జగన్ పార్టీ అవిశ్వాస తీర్మానం ఇవ్వగా పార్లమెంట్‌లో టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం స్పీకర్ కార్యాలయానికి వెళ్లి అవిశ్వాస తీర్మానం పత్రికని అందజేశారు. అంతే రాజకీయం ఇక్కడే రాజుకుంది. రంజుగా మారింది.
ప్రస్తుతం ఇరు పార్టీలు ఇతర పార్టీల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యాయి. అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఆజాద్, జ్యోతిరాదిత్య సుమారు 20 పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే అవిశ్వాసానికి సంబంధించిన నోట్‌ను స్పీకరుకు అందించిన వైసీపీ, సోమవారం మరోసారి ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే వైసీపీకి 120 మంది ఎంపీల మద్దతు కూడగట్టింది. కాంగ్రెస్ నుంచి 48, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 34, శివసేన నుంచి 18, సీపీఎం నుంచి 9, ఏస్పీ నుంచి 7. ఆమ్ ఆద్మీ నుంచి 4గురు ఎంపీల మద్దతు సంపాదించింది.
టీడీపీ అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మమత్ ట్వీట్ చేశారు. అవిశ్వాసం తీర్మానంపై 54 మంది ఎంపీల సంతకాలు చేయించి సోమవారానికల్లా లోక్‌సభలో తీర్మానం చర్చకు వచ్చేలా చేయాలన్నది పార్టీల ప్రయత్నం. ఇక వైసీపీ తీర్మానానికి సీపీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. అవిశ్వాసయుద్ధానికి సై అన్నాయి.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT