బీజేపీతో దోస్తీ కటీఫ్: చంద్రబాబు

బీజేపీతో దోస్తీ కటీఫ్: చంద్రబాబు
x
Highlights

నాలుగేళ్లు ఎదురుచూశాం ఓపికపట్టాం మిత్రపక్షంగా ఒత్తిడి తెచ్చాం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాం పార్లమెంట్ లో నిరసన తెలిపాం పోరాటం చేశాం ఇక ఓపిక పట్టడం తమ...

నాలుగేళ్లు ఎదురుచూశాం ఓపికపట్టాం మిత్రపక్షంగా ఒత్తిడి తెచ్చాం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాం పార్లమెంట్ లో నిరసన తెలిపాం పోరాటం చేశాం ఇక ఓపిక పట్టడం తమ వల్ల కాదంటున్నారు టీడీపీ నేతలు ఇక తాడోతాడో తేల్చుకొనేందుకు డిసైడయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక బీజేపీతో తెగదెంపులేనని సంకేతాలిచ్చారు. అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటనకు సిద్ధమవుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చిచెప్పడంతో టీడీఎల్పీ భేటీలో వాడివేడి చర్చ జరిగింది. కేంద్రం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన చంద్రబాబు బీజేపీతో కలిసుందామా లేదా అంటూ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. తక్షణమే కేంద్రం నుంచి బయటికి వద్దామా? లేక కొంతకాలం వేచిచూద్దామా అని చంద్రబాబు వారిని అడిగారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని మెజార్టీ సభ్యులు చెప్పారు. 95% ఎమ్మెల్యేలు తక్షణమే బీజేపీతో దోస్తీకి కటీఫ్ చెప్పేద్దామని అన్నారు. రేపో ఎల్లుండో ఈ వ్యవహారం తేల్చేద్దామని బాబు వ్యాఖ్యానించారు.

కేంద్రం ఇలా ఎందుకు చేస్తుందో అర్థంకావడం లేదని చంద్రబాబు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కలిగే ఇబ్బందేంటో చెప్పాలని బాబు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇచ్చిన హామీలనే అమలు చేయాలని పదేపదే కోరుతున్నామన్నారు. పోలవరానికి నిధుల విషయంలో ఇబ్బంది అవుతుందనే ఇన్ని రోజులు ఆగానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇబ్బందులెదురైనా ఫర్వాలేదని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు.

అందరూ హోదా కోసం పట్టుబట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సందిగ్ధం వద్దు ప్రత్యేక హోదానే మన నినాదమంటూ ఎమ్మెల్యేలకు బాబు చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటే నిధులు తెచ్చుకోలేమా అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం సహకారం లేకుండా వరుసగా గెలుస్తున్న పార్టీలు చాలా ఉన్నాయన్నారు టీడీపీ అధినేత. ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా ఉంటామని చంద్రబాబుకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భరోసా ఇఛ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories