టీడీపీకి మరో షాక్ నేడు వైసీపీలో చేరతానన్న కీలకనేత!

nanireddy
Updated on: 24 Dec 2018 1:26 PM IST
టీడీపీకి మరో షాక్ నేడు వైసీపీలో చేరతానన్న కీలకనేత!
X

రెండేళ్ల కిందట వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీగా వలసలు ఊపందుకోగా. అవి వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితో ఆగిపోయాయి. తాజాగా అవి టీడీపీకి సంకటంలా మారాయి. 20 రోజుల కిందట కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరగా తాజాగా నేడు వసంత కృష్ణప్రసాద్ టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. నేడు జగన్ సమక్షంలో ఆ పార్టీ వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పాదయాత్ర సందర్బంగా జగన్ ను కలిసి పార్టీలో చేరనున్నారు కృష్ణప్రసాద్.. ఆయన మాజీ హోమ్ మంత్రి వసంత నాగేశ్వర రావు కుమారుడు.. కృష్ణప్రసాద్ ను వైసీపీలోకి వెళ్లనీయకుండా మంత్రి దేవినేని ఉమా, విజయవాడ టీడీపీ అధ్యక్షుడు బుద్ధ వెంకన్నలు తీవ్ర ప్రయత్నాలు చేశారు కానీ అవి బెడిసికొట్టాయి.

nanireddy

nanireddy

Next Story