టీడీపీ నేత చమన్ మృతి.. షాక్ లో మంత్రి పరిటాల!

nanireddy
Updated on: 24 Dec 2018 1:25 PM IST
టీడీపీ నేత చమన్ మృతి.. షాక్ లో మంత్రి పరిటాల!
X

టీడీపీ నేత అనంతపురం జెడ్పి మాజీ ఛైర్మెన్ చమన్ సాబ్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుకు గురైన ఆయనను బంధువులు హాస్పిటల్ లో చేర్పించారు చికిత్స పొందుతూ మరణించారు. మాజీ మంత్రి టీడీపీ నేత పరిటాల రవికి ముఖ్య అనుచరుడిగా ఉన్న చమన్.. రవి మరణాంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.అనంతరం టీడీపీలో యాక్టీవ్ అయ్యారు. బీసీ సామజిక వర్గానికి జిల్లాలో పెద్దపీట వెయ్యాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చమన్ ను జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా ఎంపిక చేశారు. ఇక చమన్ మరణణవార్త తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత స్పృహ తప్పి పడిపోయారు.కాగా చమన్ మృతిపట్ల సీఎం చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు.

nanireddy

nanireddy

Next Story