ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌!

nanireddy
Updated on: 24 Dec 2018 1:50 PM IST
ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌!
X

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్నారు. జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నియామకంతో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఉమ్మడి హైకోర్టుకు రెగ్యులర్‌ చీఫ్‌ జస్టిస్‌ నియామకం జరిగినట్లయింది. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ వ్యవహరిస్తున్నారు. కేరళకు చెందిన జస్టిస్ రాధాకృష్ణన్‌.. కొల్లమ్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లా కాలేజీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. 1983 డిసెంబరులో న్యాయవాదిగా నమోదు చేయించుకుని తిరువనంతపురంలో ప్రాక్టీసు ప్రారంభించారు. ఆయన తల్లిదండ్రులు కూడా న్యాయవాదులే కావడం గమనార్హం.

nanireddy

nanireddy

Next Story