మహిళా ఎస్పీపై ఐజీ లైంగిక వేధింపులు

nanireddy
Updated on: 24 Dec 2018 2:42 PM IST
మహిళా ఎస్పీపై ఐజీ లైంగిక వేధింపులు
X

ఓ మహిళా ఎస్పీపై ఐజీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. ఆమె పై అధికారి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. గ్రేటర్ చెన్నై పోలీస్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా బాధిత మహిళ పని చేస్తున్నారు. ఏడు నెలల క్రితం తన పనిని మెచ్చుకునే సాకుతో ఐజీ తనను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తే తాను ప్రతిఘటించినట్లు చెప్పారు. ఏదైనా కేసుకు సంబంధించిన సమాచారం గురించి మాట్లాడడానికి వెళితే అతడి సెల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు చూపించేవారన్నారు. వాటిని తన సెల్‌కి కూడా పంపించేవారన్నారు. తనని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా అతడికి లొంగలేదని తెలియజేసారు. దీంతో ఏసీఆర్‌లో తనకు వ్యతిరేకంగా రాస్తానని బెదిరించినట్టు ఆమె తెలిపారు. గతనెల రోజులుగా అతని వికృత చేష్టలు శృతి మించాయని దీంతో విసిగి వేసారిన ఆ అధికారిణి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

nanireddy

nanireddy

Next Story