నన్ను ఆ పార్టీలో చేర్చుకోకుంటే ఆరోజు నా సత్తా ఏంటో చూపిస్తా : అళగిరి

nanireddy
Updated on: 24 Dec 2018 2:45 PM IST
నన్ను ఆ పార్టీలో చేర్చుకోకుంటే ఆరోజు నా సత్తా ఏంటో చూపిస్తా : అళగిరి
X

డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్‌ ఎంపిక దాదాపు ఖరారైంది.నేడు (మంగళవారం) జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్‌ స్టాలిన్‌ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. కోశాధికారి పదవికి సీనియర్‌ నేత దురై మురుగన్‌ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానుంది. మరోవైపు డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తన సోదరుడు స్టాలిన్‌ను డీఎంకే బహిష్కృత నేత అళగిరి హెచ్చరించారు. పార్టీలోకి తనను చేర్చుకోకుంటే సెప్టెంబర్‌ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తన సత్తా ఏంటో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు అళగిరి.

nanireddy

nanireddy

Next Story