గుండెపోటుతో సినీ హాస్య నటుడు మృతి!

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
గుండెపోటుతో సినీ హాస్య నటుడు మృతి!
X

సినీ హాస్య నటుడు కవి కుమార్ ఆజాద్ సోమవారం గుండెపోటుతో మ‌ృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తారక్ మెహతా కా ఉల్టా చష్మా షోలో డాక్టర్ హన్స్‌రాజ్ హాతి క్యారెక్టర్‌తో కుమార్ పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు ఉదయం తీవ్రంగా గుండె పోటు రావడంతో వోక్‌హార్డ్ ఆసుపత్రిలో చేరిన కుమార్ చికిత్స తీసుకుంటూ మరణించాడు. ఆరోగ్యం బాలేకపోయినా షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా ఉండేవాడు. మేలా. ఫంతూష్‌ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ కవి కుమార్ నటించాడు.

nanireddy

nanireddy

Next Story