ఆనం కుటుంబానికి సుప్రీంకోర్ట్‌ షాక్‌

x
Highlights

ఒకప్పటి రాచరికపు ఆనవాళ్లకు అది సజీవసాక్ష్యం. ఎందరో నాయకులకు, మహోన్నత వ్యక్తులకు అక్షరాలు నేర్పిన ఆలయం. మరెందరికో రాజకీయ పాఠాలు నేర్పిన విద్యాలయం....

ఒకప్పటి రాచరికపు ఆనవాళ్లకు అది సజీవసాక్ష్యం. ఎందరో నాయకులకు, మహోన్నత వ్యక్తులకు అక్షరాలు నేర్పిన ఆలయం. మరెందరికో రాజకీయ పాఠాలు నేర్పిన విద్యాలయం. నెల్లూరు జిల్లా చరిత్రలో ఎనభై ఏళ్ల చరిత్ర కలిగిన ఆనం కుటుంబానికి అదే రాజకీయ ఆసరా. దాని పేరే వీఆర్ కళాశాల. అలాంటి విద్యా కేంద్రంపై ఇప్పుడో చర్చ జరుగుతోంది. ఆనం కుటుంబానికి సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్‌తో నెల్లూరు నివ్వెరపోయింది. ఇంతకీ ఏం జరిగింది.

రెండున్నర దశాబ్దాల పోరాటం..రాజకీయ యోధులతో సమరం.. ఎన్నో కేసులు.. మరెన్నో అవమానాలు.. సంపాదించినదంతా కోర్టు చుట్టూ తిరిగేందుకే ఖర్చు.. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా వెనగడుగేయని దైర్యం.. చివరికి అద్బుత ఫలితం.. ఇది విఆర్ విద్యాసంస్థలపై పూర్వ విద్యార్దలు సాగించిన పోరాటం..

సాధించిన విజయం పాతికేళ్ల నుంచి ఆనం వివేకానందారెడ్డి కరస్పాండెంట్‌గా కొనసాగుతున్న వెంకటగిరి రాజా విద్యాసంస్థల పాలకవర్గం ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ ఏడాది జులైలోపు కొత్త కమిటిని ఎన్నుకోవాలని అప్పటి వరకు ప్రత్యేకపాలనాధికారిని నియమించాలని ఆదేశించింది.

పూర్వ విద్యార్దులను ఓటర్లుగా నమోదు చేయాలన్నది సుప్రీంకోర్టు ఆదేశం. వారి ద్వారా ఎన్నికల నిర్వహించి ఏడుగురు పాలకమండలి సభ్యులుగా ఎన్నుకోవాలని చెప్పింది. తద్వారా నూతన పాలక మండలిని ఏర్పాటు చేయాలని తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియ అంతా హైకోర్టు పర్యవేక్షణలోనే జరగాలని దిశానిర్దేశం చేయడంతో ఆనం కుటుంబానికి చెక్‌ పడినట్టుయింది.

సుప్రీంకోర్టు తీర్పుతో దశాబ్దాల ఆనం ఆధిపత్యానికి ఎండ్ కార్డు పడింది. వీఆర్ విద్యాసంస్థల పాలకవర్గం ఎన్నిక చెల్లదంటూ గతేడాది మార్చిలో హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై వివేకా మళ్లీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. పరిశీలిచిన కోర్టు ఈ పిటిషన్ గతేడాది అక్టోబర్‌లో దాన్ని కొట్టేసింది.. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషిన్ దాఖు చేశారు. ప్రతివాదులుగా వీఆర్ కళాశాల పూర్వ విద్యార్థి ఆమంచర్ల శంకర్ నారాయణతో పాటు పలువురిని చేర్చారు.. అయితే ఇదే సమయంలో ఆనం వివేకా వేసిన ఎస్‌ఎల్‌పీ కౌంటర్‌గా శంకర్ నారాయణ కేవియట్ పిటిషన్ ఫైల్ చేశారు.

ఇరువర్గాల వాదలను విన్న సుప్రీంకోర్టు ప్రస్తుత పాలవర్గ నియామకం చెల్లదంటూ తీర్పునిచ్చింది. వెంటనే ఆ పాలకవర్గాన్ని రద్దు చేసి జూలైలోపు కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా వీఆర్ విద్యాసంస్థలపై ఆనం కుటుంబానికి ఉన్న ఆధిపత్యానికి చెక్ పడినట్టయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories