బిగ్ బ్రేకింగ్ : యడ్యూరప్పకు సుప్రీం షాక్..

nanireddy
Updated on: 24 Dec 2018 1:29 PM IST
బిగ్ బ్రేకింగ్ : యడ్యూరప్పకు సుప్రీం షాక్..
X

కర్ణాటకలో నూతన ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్పకు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. రహస్య ఓటింగు నిర్వహించరాదన్న సుప్రీం.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత చేతులెత్తించాలని స్పష్టం చేసింది. దీంతో 15 రోజుల గడువు కోరిన యడ్డీకి ఎమ్మెల్యేల సమీకరణ కాస్త తలనొప్పిగానే మారే అవకాశముంది. ఒకవేళ బలనిరూపణ నెగ్గని పక్షంలో విశ్వాసాన్ని కోల్పోయి సీఎంగా రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో సుప్రీం తీర్పు నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

nanireddy

nanireddy

Next Story