RRB పరీక్ష కోసం వచ్చి పోలీసుల అదుపులో ఉన్న విద్యార్థులు

nanireddy
Updated on: 24 Dec 2018 2:46 PM IST
RRB పరీక్ష కోసం వచ్చి పోలీసుల అదుపులో ఉన్న విద్యార్థులు
X

హైదరాబాద్ లో జరిగిన ఆర్ఆర్బీ పరీక్ష కోసం వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది అభ్యర్ధులు సికింద్రబాద్ కు వచ్చారు. ఎగ్జామ్ తర్వాత ఎవరి రాష్ట్రాలకు వారు పయనం అయ్యేందుకు రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అయితే..ట్రైన్ రావటానికి రెండున్నర గంటల సమయం ఉండటంతో దాదాపు వెయ్యి మంది అభ్యర్ధులు అక్కడున్న పార్కింగ్ స్థలంలో సేద తీరారు. అయితే..
వారిని అక్కడ్నుంచి నుంచి వెళ్లాల్సిందిగా అక్కడి పార్కింగ్ సిబ్బంది పంపించే ప్రయత్నం చేశారు. తాము రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం పరీక్ష రాసి వచ్చామని కాసేపు సేదతీరతామని వారితో చెప్పారు. కానీ సిబ్బంది మాట వినలేదు. దీంతో విద్యార్ధులకు, పార్కింగ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. దాడికి పాల్పడిన వారిని పోలీసులు ఆదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, విద్యార్ధులంతా పెట్రోలింగ్ వాహానాలను అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

nanireddy

nanireddy

Next Story