ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

nanireddy
Updated on: 24 Dec 2018 2:02 PM IST
ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
X

ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదిలాబాద్ బోధ్ మండలం సుంకిడి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన జైముత్తాకుల సుంకన్న, పద్మ దంపతుల కుమర్తె జ్యోతి (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదువుతోంది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఆదివారం తల్లి పద్మ చర్చికి వెళ్లి వచ్చే సరికి జ్యోతి ఇంట్లో దూలానికి ఊరేసుకుని మృతి చెంది ఉండడంతో ఒకేసారి కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కల వారు వచ్చి చేసే సరికి అప్పటికే మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి గతకొంత కాలంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోందని వెల్లడించారు. కాగా ఆమె జ్యోతి తండ్రి ఇదివరకే మృతి చెందగా, జ్యోతి తమ్ముడు మానసిక పరిస్థితి సరిగాలేకపోవడంతో తల్లి పద్మ రోదనలు మిన్నంటాయి ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story