యువతికోసం కొట్టుకున్న యువకులు.. చివరకు..

nanireddy
Updated on: 24 Dec 2018 2:48 PM IST
యువతికోసం కొట్టుకున్న యువకులు.. చివరకు..
X

ఓ యువతికోసం యువకులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లో జరిగింది. విజయవాడ మాచవరంకు చెందిన రేవంత్‌ బీటెక్‌ చదివే సమయంలో తన తోటి విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల వీరిద్దరూ మనస్పర్థల కారణంగా విడిపోయారు. కాగా రేవంత్‌ ప్రవర్తన నచ్చని యువతి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3 అరోరాకాలనీలో ఉంటున్న తన స్నేహితుడు అఖిల్‌(26) వద్దకు వచ్చింది. అఖిల్ తన ఇంటిలోనే కన్సల్టెంట్ ఆఫీస్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేమితురాలికి ఓ గది కేటాయించి ఆశ్రయం ఇచ్చాడు. ఇది తెలిసి రేవంత్ ఆ యువతిని తనవద్దకు రమ్మని బెదిరించాడు. ఆమెను తన వద్దకు పంపకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని అఖిల్ ను హెచ్చరించాడు. ఆదివారం 30 మంది అనుచరులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటి వద్ద గొడవ చేశాడు రేవంత్. అఖిల్‌ కూడా తన స్నేహితులను పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో రెండు గ్రూపులకు మధ్య ఘర్షణ జరగడంతో అఖిల్‌ అతడి స్నేహితులకు గాయాలయ్యాయి. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేవంత్, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

nanireddy

nanireddy

Next Story