ఓ ఇంటివాడైన స్టీవ్ స్మిత్

nanireddy
Updated on: 24 Dec 2018 2:55 PM IST
ఓ ఇంటివాడైన స్టీవ్ స్మిత్
X

ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ ఇంటివాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు అయిన డానీ విల్లీస్ ను అయన పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు పలువురు క్రికెటర్లు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు స్మిత్ జనవరిలో ప్రకటించాడు. అన్నట్టే అయన శనివారం స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరికి 2017లోనే ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక డానీ విల్లీస్ తో తన వివాహానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ ద్వారా స్మిత్ పంచుకున్నాడు. ‘నా ప్రియ స్నేహితురాలిని ఈరోజు పెళ్లి చేసుకున్నా. ఈరోజు ఎంతో గొప్పగా ఉంది. డానీ చాలా అందంగా కనిపిస్తోంది’ అంటూ స్మిత్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

nanireddy

nanireddy

Next Story