బాల్ ట్యాపరింగ్ తరువాత స్టీవ్‌ స్మిత్‌ గొప్ప నిర్ణయం!

బాల్ ట్యాపరింగ్ తరువాత స్టీవ్‌ స్మిత్‌ గొప్ప నిర్ణయం!
x
Highlights

దక్షిణాఫ్రికా సిరీస్ లోబాల్‌ట్యాంపరింగ్‌ కు పాల్పడి జట్టు నుంచి సస్పెన్షన్ కు గురయ్యాడు స్టీవ్ స్మిత్. ప్రస్తుతం డేవిడ్‌ వార్నర్‌తో పాటు స్మిత్‌ కెనడా...

దక్షిణాఫ్రికా సిరీస్ లోబాల్‌ట్యాంపరింగ్‌ కు పాల్పడి జట్టు నుంచి సస్పెన్షన్ కు గురయ్యాడు స్టీవ్ స్మిత్. ప్రస్తుతం డేవిడ్‌ వార్నర్‌తో పాటు స్మిత్‌ కెనడా టీ20 లీగ్‌​లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్ ద్వారా వచ్చిన డబ్బును వివిధ స్వచ్ఛంద సంస్థలకు, క్రికెట్‌ ప్రచార కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నట్లు ఈ మాజీ సారథి ప్రకటించాడు. ఈ విషయాన్నీ అధికారికంగా క్రికెట్ ఆస్ట్రేలియా స్వయంగా అధికారిక వెబ్సైట్ లో వెల్లడించింది. కాగా ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే కెనడా లీగ్‌లో స్మిత్‌ తోపాటు డేవిడ్‌ వార్నర్‌ కూడా పాల్గొననున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా.. కెనడా పట్టణాలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఐదు జట్లు పాల్గొననున్నాయి. ఆరో జట్టు క్రికెట్‌ వెస్టిండీస్‌ తరుపున బరిలోకి దిగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories