అతిలోక సుందరి చివరి మజిలీ ప్రారంభం

అతిలోక సుందరి చివరి మజిలీ ప్రారంభం అయింది.. జీవించినన్నాళ్లూ నటనకే జీవితాన్ని అంకితం చేసిన అందాల సుందరి ఇక...
అతిలోక సుందరి చివరి మజిలీ ప్రారంభం అయింది.. జీవించినన్నాళ్లూ నటనకే జీవితాన్ని అంకితం చేసిన అందాల సుందరి ఇక శెలవంటూ మనల్ని విడిచి వెళ్లిపోతోంది.. జాము రాతిరి జాబిలమ్మ తిరిగి రాని లోకాలకు మరలిపోతోంది.. పూల రెక్కలు, కొన్ని తేనెచుక్కలు కలగలిపిన ఈ అపురూప సౌందర్య రాశి..పూల పాన్పుపై నిద్రిస్తున్నట్లుగా కనిపిస్తోందని శ్రీదేవి పార్ధివ దేహాన్ని చూసిన వారు చెబుతున్న మాట.. శ్రీదేవి బౌతిక కాయాన్ని సందర్శించిన వారు బయటకొచ్చి చెప్పిన దాని ప్రకారం శ్రీదేవిని ఎర్రని పట్టుచీరలో అలంకరించారని.. లిల్లీపూల పందిరి కింద లిల్లీ పూల పాన్పుపై పడుకోబెట్టారని చెబుతున్నారు.. అందంగా అలంకరించుకోడాన్ని అమితంగా ఇష్టపడే శ్రీదేవికి చివరి సారి సాగనంపేటప్పుడూ అంతే అందంగా అలంకరించారని ఆమెను చూసిన వారు చెబుతున్న మాట. శ్రీదేవి భౌతిక కాయాన్ని సందర్శించుకోడానికి భారీ సంఖ్యలో జనం తరలి వస్తున్నారు.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీ వుడ్, మల్లూ వుడ్ ఇలా అన్ని రంగాల సినీ ప్రముఖులు ఆమెను కడసారి సందర్శించుకుంటున్నారు.. శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు దేశ వ్యాప్తంగా ఆమె అభిమానులు పోటెత్తారు.. నిన్న అర్ధరాత్రి దాటినా.. పెద్ద సంఖ్యలో జనం ఆమె ఇంటి ముందు పడిగాపులు కాశారు.. శ్రీదేవిని అభిమానించే ఓ అంధుడు కూడా ఆమె ఇంటి ముందు నిలబడి ఎప్పటి కప్పుడు ఆమె మరణ సంబంధ వార్తలు తెలుసుకున్నాడు..
మానవా.. మానవా అంటూ చిలిపి గొంతుతో మనల్ని అలరించిన ఆ అద్భుత సౌందర్య రాశి స్వరం శాశ్వతంగా మూగబోయింది. పాలలాంటి స్వచ్ఛమైన తెల్లని మనసు.. ముట్టుకుంటే మాసిపోయే ముగ్ధ మోహన రూపం.. చిలిపి నవ్వు.. కొంటె కళ్లు.. చక్కని శరీర సౌష్టవం.. దివినుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య లాంటి శ్రీదేవి కానరాని లోకాలకు తరలిపోయింది..తన నటనతో యావత్ ప్రపంచాన్ని తన్మయులను చేసిన ఈ అందాల సౌందర్య రాశి.. ఇక కాసేపట్లో శాశ్వతంగా కనుమరుగు అయిపోతోందన్న నిజం అభిమానులను నిలవనీయడం లేదు.. ఎప్పుడు చూసినా ఎవర్ గ్రీన్ గా టాప్ టు బాటమ్ అందంగా కనిపించే శ్రీదేవి ఎప్పటికీ అందానికి ఐకాన్ గా నిలిచిపోతుంది..కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన జన సందోహంతో ముంబై జన సంద్రంగా మారిపోయిది. ఐస్ క్రీమ్ అన్నా, కేక్ అన్నా శ్రీదేవికి ప్రాణం.. అందుకే ఆమెనుంచిన భౌతిక కాయం పక్కనే తెల్లని పెద్ద సైజ్ కేక్ ను కూడా ఉంచారు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
Revanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMTDiabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMT