logo
సినిమా

ఆస్తి గొడవలే శ్రీదేవిని దెబ్బతీశాయా?

ఆస్తి గొడవలే శ్రీదేవిని దెబ్బతీశాయా?
X
Highlights

క్షణక్షణానికి మారుతున్న పరిణామాలు శ్రీదేవిది సహజ మరణం కాదని స్పష్టం చేస్తున్నాయి. అయితే దీనికి బీజం మోహిత్‌...

క్షణక్షణానికి మారుతున్న పరిణామాలు శ్రీదేవిది సహజ మరణం కాదని స్పష్టం చేస్తున్నాయి. అయితే దీనికి బీజం మోహిత్‌ మార్వా పెళ్లిలోనే పడింది. ఆ పెళ్లిలో శ్రీదేవి నవ్వుతూ తిరుగుతున్నది, ఆమె నృత్యం, ఎంజాయ్‌ చేసిన బోనీ కపూర్‌ల దృశ్యాలే ప్రపంచానికి తెలుసు. కానీ ఆ సంతోషాల మాటునే బోనీ-శ్రీదేవి మనసులో బడబాగ్ని దాగిందా? దానికి ఆస్తి గొడవలే కారణమా?

మోహిత్‌ మార్వా- బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా తరఫు బంధువు. మోనా 2012లోనే చనిపోయింది కానీ ఈ పెళ్లికి ఆమె తరఫు వారంతా తరలి వచ్చారు. శ్రీదేవి కూడా భర్తను, చిన్న కూతురు ఖుషీని తీసుకెళ్లి పాల్గొంది. అయితే, పెళ్లిలో బోనీకపూర్‌ ఖుషీని విడిచిపెట్టి ఎక్కువగా మోనా పిల్లలు అర్జున్‌ కపూర్‌, అన్షలాలతో గడపడం శ్రీదేవికి నచ్చలేదు. ఆ విషయమే ఆమె బోనీని ప్రశ్నించినట్లు సమాచారం. ‘మీకు అర్జున్‌, అన్షులాలే పిల్లలా? ఖుషీ కాదా? ఆమె ఈ పెళ్లిలో ఏకాకిగా మిగిలిపోయింది నా పిల్లలు నీకు పిల్లలు కారా?’ అని నిలదీసినట్లు తెలుస్తోంది.

శ్రీదేవి ప్రశ్నలకు బోనీ కూడా సూటిగా సమాధానం ఇవ్వలేకపోవడంతో విషయం చిలికి చిలికి గాలివానయ్యింది. ఆస్తిలో సగభాగం మొదటి భార్య సంతానానికి కూడా చెందితే తన బిడ్డల గతేం కాను అని శ్రీదేవి చాలా ఆందోళనపడ్డట్లు తెలుస్తోంది. తొలి భార్య పిల్లలతో బోనీ సఖ్యతపై శ్రీదేవి చాలా ఆగ్రహంగా స్పందించినట్లు, ఇది పెళ్లినాటి ప్రమాణాలకు విరుద్ధమని ఆమె గట్టిగా చెప్పినట్లూ తెలుస్తోంది.

మొదటి భార్యతో ఆర్థిక సంబంధాలు తెంచుకుంటేనే మన వివాహ బంధం మొదలవుతుందని 1996లో పెళ్లి సమయంలో బోనీకి శ్రీదేవి పెట్టిన షరతు. అప్పటికి సరేనన్న బోనీ ఆ తరువాత మళ్లీ తొలి భార్యతో సంబంధాలు కొనసాగించారని, చివరకు శ్రీదేవి కూడా సమాధానపడ్డారని తెలుస్తోంది. అయితే ఇపుడు బోనీ - మళ్లీ అర్జున్‌ వైపు చూస్తుండడంతో ఆమెకు కొత్త సమస్య మొదలయ్యింది. ఒక పక్క జాహ్నవిని మంచి నటిగా నిలబెట్టాలని తాను తాపత్రయపడుతూంటే బోనీ మాత్రం తన పుత్రరత్నం వైపు మనసు పెట్టడం ఆమెలో కల్లోలాన్ని రేపింది.

బోనీకి ఏమీ లేని స్థితిలో ఆమె ఆయనను పెళ్లి చేసుకుని- తన ఆస్తినంతా ఆయన పరం చేసి జీవితం గడుపుతూ వచ్చింది. ఓ రకంగా ఇన్నేళ్లూ బోనీ అనుభవిస్తున్నదంతా శ్రీదేవి సంపాదించిన ఆస్తే. ఇపుడా ఆస్తిని బోనీ- తన తొలి భార్య పిల్లలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోడానికి శ్రీదేవి ఇష్టపడడం లేదు. జాహ్నవి, ఖుషీల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని ఆరాటపడింది. జాహ్నవి తొలి సినిమా ధడక్‌ ను ఖరారు చేసి సెట్స్‌ దాకా తీసికెళ్లింది కూడా శ్రీదేవే.

శ్రీదేవి దుబాయ్‌లో ఉండిపోవడానికి కారణం మారుతున్న బోనీ వైఖరి గురించి ఆలోచించడానికేనని, జాహ్నవికి షాపింగ్‌ అన్నది కేవలం ఒక సాకు మాత్రమేనని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆస్తి పంపకంపై ఆమె చాలా మానసిక ఒత్తిడికి గురయినట్లు, బోనీతో ఫోన్లోనే గొడవపడ్డట్లు కూడా బయటకు పొక్కింది. అయితే ఈ విషయాల్ని కచ్చితంగా చెప్పదగినవాడు బోనీ ఒక్కరే. ఆయనే బైటపెడతారా? విచారణలో బైటపడతాయా? అన్నది తేలాల్సి ఉంది.

Next Story