logo
సినిమా

బోనులో బోనీ?

బోనులో బోనీ?
X
Highlights

శ్రీదేవి కేసులో ప్రధాన సాక్షి ఆమె భర్త బోనీ కపూర్. హోటల్ గదిలో శ్రీదేవి చనిపోయేముందు ఏం జరిగింది? అనే అంశంపై...

శ్రీదేవి కేసులో ప్రధాన సాక్షి ఆమె భర్త బోనీ కపూర్. హోటల్ గదిలో శ్రీదేవి చనిపోయేముందు ఏం జరిగింది? అనే అంశంపై కచ్చితమైన సమాధానం ఇవ్వగలిగినవాడు ఆయనొక్కరే. కానీ దుబాయ్ పోలీసు అధికారులకు బోనీ ఇచ్చిన స్టేట్మెంట్ సంతృప్తి కలిగించడం లేదు. పొంతని కుదరని బోనీ మాటలు ఆయనపై సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే బోనీకపూర్ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఆయనను త్వరలో ఇంటరాగేట్ చేయనున్నారు. పాస్ పోర్టు స్వాధీనం చేసుకోవడం, ఆయన కుటుంబ సభ్యులు కూడా దేశం విడిచి వెళ్లొద్దని చెప్పడం చూస్తే బోనీ కపూర్ ఈ కేసులో కార్నర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ కేసులో సంబంధించి భర్త బోనీ కపూర్ చెబుతున్న కథనంతో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవిని సర్‌ఫ్రైజ్ చేయడానికి వచ్చానన్న బోనీ తామిద్దరం సుమారు 15నిమిషాలు మాట్లాడుకున్నాం నవ్వుకున్నామని చెప్పారు. అనంతరం ఓ ఫంక్షన్‌కు వెళ్లాలని రెడీ కావాలని చెప్పగా ఆమె ఫ్రెషప్ అయ్యేందుకు బాత్‌‌రూమ్‌‌కు వెళ్లిందని చాలా సేపటికీ బయటికి రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెంది తలుపులు పగలగొట్టగా అపస్మారక స్థితిలో కనిపించిందన్నాడు. దీంతో షాక్‌కు గురై స్నేహితుడికి ఫోన్ చేశాననీ ఆ తర్వాతే హోటల్ యాజమాన్యానికి చెప్పి సమీపంలో ఉన్న రషీద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్దారించారనేది బోనీ చెబుతున్నట్టు తొలుత వచ్చిన కథనం.

అయితే ఏదైనా స్టార్‌ హోటల్స్‌లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ టీం ఉంటుంది వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు లేదంటే మెడికల్ హెల్ప్ ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. మొదట హోటల్ వాళ్లకు చెప్పకుండా స్నేహితుడికి బోనీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆమె చనిపోయిందని దృవీకరించుకున్న తర్వాతే స్నేహితుడికి చెప్పారా? అసలు ఈ విషయాన్ని ఎందుకింత ఆలస్యంగా చెప్పాల్సి వచ్చింది? అనేవి బోనీ అంశంలో తలెత్తుతున్న ప్రశ్నలు.

మొదట కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లిన బోనీ ముంబైకి తిరిగొచ్చేసిన తర్వాత ఆ రెండ్రోజులు ఆమె బయటికి రాకుండా గదిలోనే ఉన్నారనే విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవిని సర్ ప్రైజ్ చేయడానికే బోనీ మళ్లీ ముంబై నుంచి దుబాయ్ వెళ్లాడా? ఇంకేమైనా కారణాలున్నాయా? అనే అంశంపైనా అనుమానాలు వీడటం లేదు. దీంతో బోనీ, శ్రీదేవి కాల్ డేటాను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

మరోవైపు ప్రాసిక్యూషన్ రంగంలోకి దిగడంతో రీ-ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి విచారణ జరుగుతుంది. ఫోరెన్సిక్ పూర్తి రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే కుట్ర జరిగిందా? లేదా ఆత్మహత్యా? లేదా సహజ మరణమా? అన్నది తేలనుంది. అనుమానాలున్న విషయం వాస్తవమే వీటిని నివృతి చేసుకునేందుకు న్యాయనిపుణులు, పోలీసు విభాగం ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం.

Next Story