ఆ నటుడుడికి క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి..

nanireddy
Updated on: 24 Dec 2018 2:00 PM IST
ఆ నటుడుడికి క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి..
X

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై తీవ్ర దుమారం రాజేసినా సంగతి తెలిసిందే. కొందరు నటులు తమను లైంగికంగా వేధిస్తున్నారని నటి శ్రీరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నటులు పవన్, నానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను బహుభాషా నటుడు, దక్షిణ భారత నటుల సంగం ప్రధానకార్యదర్శి విశాల్ ఖండించారు. ఆ తరువాత తమిళ దర్శకుడు మురుగదాస్, సుందర్‌.సీ, రాఘవ లారెన్స్, శ్రీకాంత్‌ వంటి వారిపై ఆరోపణలు గుప్పించి కలకలం సృష్టించింది శ్రీరెడ్డి. దీంతో విశాల్.. ఆధారాలు లేకుండా ఇలా ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. దీనికి స్పందించిన శ్రీరెడ్డి ఒక టీవీ ఛానల్‌ సమావేశంలో విశాల్‌ను క్షమాపణ కోరుతున్నానని పేర్కొంది. నన్ను క్షమించండి విశాల్‌. నటీమణులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే స్థానంలో మీరు ఉన్నారు. మీ వల్లే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని ఆమె వ్యాఖ్యనించారు.

nanireddy

nanireddy

Next Story