దారుణ హత్యకు గురైన క్రికెటర్ తండ్రి !

nanireddy
Updated on: 24 Dec 2018 1:32 PM IST
దారుణ హత్యకు గురైన క్రికెటర్ తండ్రి !
X

గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో క్రికెటర్ తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ ఘటన శ్రీలంకలో జరిగింది. శ్రీలంక క్రికెటర్ ధనంజయ డిసిల్వ(26) తండ్రి రంజన్‌ డిసిల్వపై దుండగులు అర్ధరాత్రి దాడిచేశారు ఈ క్రమంలో రంజన్‌ డిసిల్వ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అతనిపై కాల్పులు జరిపారు. ఆపై ఘటనాస్థలినుంచి దుండగులు పారిపోయారు. తీవ్ర గాయాలతో రంజన్‌ డిసిల్వ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తండ్రి దుర్మరణంతో శుక్రవారం వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనంజయ డిసిల్వ తప్పుకున్నాడు.

nanireddy

nanireddy

Next Story