స్కామ్‌పై స్కాన్‌... స్పోర్ట్స్‌ కోటాలో వాటా లెక్కలు!!

స్కామ్‌పై స్కాన్‌... స్పోర్ట్స్‌ కోటాలో వాటా లెక్కలు!!
x
Highlights

తెలంగాణా స్పోర్ట్స్‌ కోటాలో మెడికల్‌ సీట్ల కుంభకోణం కేసులో ఏసీబీ దర్యాప్తు పూర్తయ్యింది. స్పోర్ట్స్ కోటాలో నాలుగు ఎంబీబీఎస్ సీట్లను స్టేట్ లెవల్...

తెలంగాణా స్పోర్ట్స్‌ కోటాలో మెడికల్‌ సీట్ల కుంభకోణం కేసులో ఏసీబీ దర్యాప్తు పూర్తయ్యింది. స్పోర్ట్స్ కోటాలో నాలుగు ఎంబీబీఎస్ సీట్లను స్టేట్ లెవల్ వారికి... శాట్‌ కమిటీ సభ్యులు భారీ మొత్తానికి అమ్ముకున్నట్లు ఏసీబీ నిర్ధారించింది.తొలుత దీనిపై రెండు కమిటీలు వేసి విచారణ చేపట్టినా... అదంతా తూతూ మంత్రంగానే సాగింది. దీంతో మరోసారి ప్రభుత్వం ఈ కేసును తీవ్ర పరిగణలోకి తీసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రే... ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఏసీబీకి ఆదేశించారు.

తెలంగాణలో స్పోర్ట్స్‌ కోటాలో మెడికల్‌ సీట్ల కుంభకోణం కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. 2017-2018 సంవత్సరంలో జరిగిన కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్‌ కాలేజీల్లో 2వేల వరకు సీట్లున్నాయి. వీటిలో వివిధ రిజర్వేషన్లలో భాగంగా స్పోర్ట్స్‌ కోటాకు 0.5శాతం కింద 10 సీట్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం స్పోర్ట్స్‌ కోటా దరఖాస్తుల్లో ముందు వరుసలో ఉన్నవారికి సీట్లను కేటాయించాలి. కానీ 9 మంది స్పోర్ట్స్‌ అధికారులు... అంతర్గతంగా ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీలోని సభ్యులే సీట్లు కేటాయింపులు చేశారు. ఈ క్రమంలో వారికి నచ్చిన వాళ్లకే సీట్లు అమ్ముకున్నారు. అనర్హులకు సీట్లు కేటాయించి.., అర్హులకి మొండి చేయి చూపారంటూ గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి.

కొద్ది రోజులు క్రితమే ఇవాన్‌జెలీన్‌ అనే ఓ క్రీడాకారిణికి సంబంధించిన వివరాలను ఆర్చరీ అసోసియేషన్‌ సభ్యులు పరిగణలోకి తీసుకోలేదు. ఆమెకు రావాల్సిన మెడికల్‌ సీటును... శాట్‌ కమిటి సభ్యులు మరొకరికి కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో ఒక్క సీటు కోసం లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ కుంభకోణంపై ద్విసభ్య కమిటీ విచారణ జరిపి... ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పని ఒత్తిడి, సమయం లేకపోవడం వల్లే.. తప్పులు జరిగాయని, ఉద్దేశ పూర్వకంగా చేసిన పని కాదని సెలక్షన్‌ కమిటీ సభ్యులు స్టేట్మెంట్‌ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం... మరోసారి విజిలెన్స్ చీఫ్ తో ఈ కుంభకోణం పై విచారణకి ఆదేశించింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఏక కాలంలో 5 ప్రదేశాల్లో సోదాలు చేశారు. పలు కీలక ఫైల్స్‌, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories