ఒంటి గంటలోపే మహాగణపతి నిమజ్జనం పూర్తి

nanireddy
Updated on: 24 Dec 2018 2:59 PM IST
ఒంటి గంటలోపే మహాగణపతి నిమజ్జనం పూర్తి
X

హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల నుంచి హుస్సెన్‌ సాగర్‌కు పెద్ద ఎత్తున గణనాథులు తరలివస్తున్నాయి. హైదరాబాద్ ప్రణతాల్లో నిమజ్జనం కోసం మొత్తం 213 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో క్రేన్‌ వద్ద గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌పై ఏర్పాటు చేసిన ఆరో నంబర్‌ క్రేన్‌ వద్ద ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపే మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

nanireddy

nanireddy

Next Story