అంతాబానే ఉంది.. కానీ..అప్పుడప్పుడు మాత్రం ఇలా ఎందుకో?

x
Highlights

ఆమె వెరీ వెరీ స్పెషల్ ఐఏఎస్ అధికారి సామాన్యులకు అతి చేరువలో ఉంటారు నిత్యం అందుబాటులో ఉంటారు చదివిన చదువు, వేరయినా కేవలం సమాజ సేవకోసమే సివిల్...

ఆమె వెరీ వెరీ స్పెషల్ ఐఏఎస్ అధికారి సామాన్యులకు అతి చేరువలో ఉంటారు నిత్యం అందుబాటులో ఉంటారు చదివిన చదువు, వేరయినా కేవలం సమాజ సేవకోసమే సివిల్ సర్వీసులలోకొచ్చారు. కాస్త డైనమిజం కొంచెం మోడ్రనిటీ మరికొంచెం వైవిధ్యం అన్నీ కలగలిపి తనదైన స్టైల్ లో పరిపాలిస్తున్నారు అందుకే ఆమె ఆల్ రౌండర్ అయ్యారు. ఆమె యువతకు ప్రేరణ సివిల్ సర్వీస్ కి అపియర్ అయ్యే వారికి ఒక రోల్ మోడల్ చూడటానికి సెలబ్రిటీలా ఉన్నా సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు యంగ్ అండ్ డైనమిక్ లేడీ అయిన అమ్రపాలి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారారు ఎందుకు?

అమ్రపాలి అంటేనే సెన్సేషన్ యువ ఐఏఎస్ లకు ఒక స్ఫూర్తి ఒక ప్రేరణ ఆమె పనితీరు సంచలనం సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చిన అమ్రపాలి ఈ మధ్య తరచుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ అమ్రపాలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హన్మకొండ పొలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అమ్రపాలి చేసిన ప్రసంగం కాస్త వివాదాన్ని రేపింది.

జెండా వందనం తర్వాత హుందాగా ప్రసంగించాల్సిన అమ్రపాలి తన ప్రసంగాన్ని కొనసాగించడానికి ఇబ్బందులు పడ్డారు. అదేపనిగా అకారణంగా నవ్వడం, గణాంకాల దగ్గర తడబడటం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది జిల్లా ప్రగతి నివేదికను చదువుతున్నప్పుడు మరుగుదొడ్ల నిర్మాణం గురించి వివరించాల్సి వచ్చింది. ఆ టైమ్ లో ఆమె నవ్వుకుంటూ తనలోతాను మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో వెనక్కు తిరిగి చూడటంతో స్టేజి మీద ఉన్న వారే కాదు ప్రేక్షకులూ కాస్త ఇబ్బంది పడ్డారు ఇదే ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరి విమర్శలకూ కారణమవుతోంది.

ఒక కలెక్టర్ ఇలా తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడటమేంటని కొందరు విస్తుబోతున్నారు ఐఏఎస్, ఐపిఎస్ లకు వారు నిర్దేశించిన ప్రాంతాల్లో పనిచేసేందుకు వీలుగా ముందు సంబంధిత భాషలో శిక్షణ ఇస్తారు మూడునెలల పాటూ ఆ భాషను చదవడం, రాయడం, సులభంగా మాట్లాడటం నేర్పిస్తారు ఆ తర్వాతే వారు సర్వీస్ లో చేరేందుకు అర్హులు కానీ అమ్రపాలి తెలుగు చదవడానికి ఇప్పుడు ఇబ్బందులు పడటం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆమె ఐఏఎస్ చదవాలనుకునేవారికి ఆదర్శం.. ముక్కు సూటి తనం, చెలాకి తనం, కలుపు గోలుతనం, సేవాభావం ఛాలెంజ్ లను తలకెత్తుకుని పరిష్కరించే సత్తా ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆమెను ఐఏఎస్ గా నిలబెట్టాయి.

తెలంగాణ కేడర్ 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాటా అమ్రపాలికి సోషల్ మీడియాలో వేలమంది ఫాలోయర్లున్నారు ఆమె ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాకు లైకులు, షేర్లూ ఎక్కువే అందంగా, హుందాగా ఉండే ఆమె యువ ఐఏఎస్ అధికారి కావడంతో సహజంగానే ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యే వారంతా ఆమెను ఫాలో అవుతూ ఉంటారు ఆమె ఎందరికో స్ఫూర్తి మంతమైన పర్సనాలిటీ అందరికోసం కాదు మన మనసుకు నచ్చిన పని మనం చేయాలనే వ్యక్తి అమ్రపాలి ఎదుటి వ్యక్తి కోసం కాదు మనకోసం మనం బతకాలి మనకు కావలసినదే చేయాలి అనే తత్వం ఆమెది. ఆమె ఐఏఎస్ అధికారి అయ్యింది జీత భత్యాలకోసమో.. సోషల్ స్టాటస్ కోసమో కాదు లక్షలాది మంది ప్రజల్లో పాజిటివ్ ప్రభావాన్ని కలిగించడం కోసం.

అమ్రపాలి చదివినది బిటెక్ సివిలింజనీరింగ్ అది మద్రాస్ ఐఐటి నుంచి ఆతర్వాత ప్రతిష్టాత్మక ఐఐఎం బెంగళూరు కేంద్రం నుంచి ఎంబిఏ కూడా చేశారామె ఆమెకున్న చదువు, తెలివితేటలకు చాలా సులభంగానే లక్షల్లో జీతం వచ్చే సౌకర్యవంతమైన ఉద్యోగం వస్తుంది. అందరిలాగే చదువు పూర్తికాగానే ఆమె ఏబిఎన్ ఆమ్రో లో జాబ్ లో జాయిన్ అయ్యారు లక్షల్లో జీతం వేగంగానే ప్రమోషన్ పొందే అవకాశం పుష్కలంగా ఉన్నాయి కానీ చేసే ఉద్యోగంలో ఆమె తృప్తి పొందలేకపోయారు నలుగురికీ సేవ చేయాలని తన మనసు చెప్పిన దారిలోనే నడిచారు లక్ష రూపాయల జీతాన్ని కాలదన్నుకుని సివిల్ సర్వీసుల కోసం ప్రిపేర్ అయ్యారు యూపిఎస్సీ, సిఎస్ ఈ ఎగ్జామ్ తొలి అటెంప్ట్ లోనే సక్సెస్ కలిగిన వారిలో ఆమె పిన్నవయస్కురాలు ఆమెకు జాతీయ స్థాయిలో 39వ ర్యాంకు వచ్చింది.

అమ్రపాలి వర్క్ ని ఎంజాయ్ చేస్తారు కమిట్ మెంట్ తో చేస్తారు డైనమిక్ గా దూసుకెడతారు తన పనితీరుతో తోటి ఐఏఎస్ లకు ఆదర్శంగా నిలుస్తారు ఫ్యాషన్ లేడీస్ కి ఒక ఐకాన్ గా మారతారు ఇలా వైవిధ్యభరితమైన అపియరెన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్టర్లకన్నా భిన్నంగా నిలిచారు.

విశాఖ పట్నానికి చెందిన అమ్రపాలిని ఇంట్లో ముద్దుగా అమ్రు అని పిలుస్తుంటారు 36 ఏళ్ల ఈ యువ ఐఏఎస్ అధికారి తండ్రి ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ తల్లి గృహిణి చదువులో చురుకైన విద్యార్ధి కావడంతో చిన్నతనంలోనే ఆమె ఎన్నో అవార్డులు, ప్రశంసలు అదుకుననారు అతిపిన్న వయసులో ఉన్న ఓ యువతి సారధ్యంలో పని చేస్తున్నామని వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది కూడా గర్వపడుతూ ఉంటారు..వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాడానికి ముందు వికారాబాద్ సబ్ కలెక్టర్ గా పనిచేశారు. 2014లో మాతా, శిశు సంరక్షణ శాఖ డైరక్టర్ గా అపాయింట్ అయ్యారు 2016లో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా ప్రమోట్ అయ్యారు. తెలంగాణలోనే తొలిపోస్టింగ్ అందుకున్న అమ్రపాలి అతి తక్కువ టైమ్ లోనే పాలనలో తనదైన ముద్రవేశారు యంగ్ అండ్ డైనమిక్ లేడీ అని ప్రశంసలందుకున్నారు.
అమ్రపాలి ఈతరం యువతుల్లాగే అందంగా, హుందాగా ఉండేందుకు ఇష్టపడతారు ఫిజికల్ ఫిట్ నెస్ కాపాడుకోడానికి ప్రతీరోజూ యోగా చేస్తారు మోడ్రన్ డ్రస్సులు ధరిస్తారు ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తారు.

సోషల్ మీడియాలో ఆమెకున్న రీచ్ చాలా ఎక్కువ వేలాది మంది అభిమానులు, ఫాలోయర్లు అమ్రపాలీకి ఉన్నారు పాలనకు మోడ్రన్ టచ్ ఇచ్చిన ఈ లేడీ నలుగురిలోకీ భిన్నంగా కనిపిస్తారు ఎక్కడున్నా.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. తెలంగాణ ను భారీ వర్షాలు కుదిపేస్తున్న టైమ్ లో వికారాబాద్ అడవుల్లో పరిస్థితిని తెలుసుకోడానికి ఇతర కలెక్టర్లతో కలసి ఆమె అడవుల్లోకి వెళ్లారు ఆ టైమ్ లో ప్రకృతిని, సీనరీని చూసి ఎంజాయ్ చేసేందుకు ఆమె జీన్స్ ధరించి వెళ్లడం కాస్త సంచలనం రేపింది. ఒక ఐఏఎస్ లేడీ అధికారిని ఇంతవరకూ ఇలా మోడ్రన్ దుస్తుల్లో చూడని జనం అమ్రపాలిని చూడగానే ఫిదా అయిపోయారు. ఫ్యాషన్ షోలకు, క్యాట్ వాక్ లకు వెళ్లడం కూడా ఆమెకు ఇష్టమే ఆ సందర్భంగా ఆమె ధరించిన డ్రస్ ఒకటి వివాదాల పాలయింది. డ్రెస్ కోడ్ పాటించాలంటూ సిఎం నుంచే ఆమెకు సూచనలు అందినట్లు చెబుతారు.

అమ్రపాలికి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. ఉత్తరాదికి చెందిన సమీర్ శర్మను ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.. 2010 ఐఏఎస్ కేడర్ కు చెందిన అమ్రపాలి.. తన జూనియర్ అధికారి సమీర్ శర్మతో కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు.. ఇరువురి తల్లి దండ్రులు పెళ్లికి ఒప్పుకోవడంతో వచ్చే నెల 18న వీరి పెళ్లి జరగబోతోంది. 2011 ఐపిఎస్ కేడర్ కు చెందిన సమీర్ శర్మ ప్రస్తుతం డయ్యు కేంద్ర పాలిత ప్రాంతం ఎస్పీగా పనిచేస్తున్నారు. అమ్రపాలి చాలా చరుకైన కలెక్టర్ మెరుగైన పాలన అందించే సక్సెస్ ఫుల్ ఆఫీసర్ కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు అంకిత భావంతో పనిచేస్తారు వరంగల్ లో బహిరంగ మలవిసర్జనను సమూలంగా నివారించడంలో ఆమె విజయం సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories