వివాహేతర సంబంధం : అన్నను హత్య చేసిన చెల్లి..

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
వివాహేతర సంబంధం : అన్నను హత్య చేసిన చెల్లి..
X

ప్రియుడితో కలిసి సొంత అన్నను అంతమొందించింది ఓ మహిళ ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరంలో వెలుగులోకి వచ్చింది. లక్కవరం గ్రామానికి చెందిన నన్నం కోటయ్య, మహాలక్ష్మమ్మకు నన్నం వెంకటేశ్వర్లు (32), తిరుపతమ్మ సంతానం. ఇరువురికి పదేళ్ల కిందట వివాహం చేశారు తల్లిదండ్రులు. వెంకటేశ్వర్లు ఆరోగ్య సమస్యతో ఉండగా భార్య అతనిని విడచి వెళ్లిపోయింది. తిరుపతమ్మ కూడా భర్తతో విడిపోయి ఇంటివద్దనే ఉంటోంది. ఈ క్రమంలో తిరుపతమ్మ అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. రాను రాను వీరి వ్యవహారం మరి శృతిమించింది. తిరుపతమ్మ తల్లి కూడా వేరే గ్రామానికి వెళ్లటంతో ఇద్దరి మధ్య ఏకాంతం ఎక్కువైంది. వారి వ్యవహారం గమనించిన అన్న వెంకటేశ్వర్లు ఇది మంచి పద్ధతి కాదని వారించాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు తన పొలం వద్దె ఉన్న నీటి కుంటలో శవమై తేలాడు. విషయం తెలిసిన బంధువులు శవాన్ని గురువారం రాత్రి నివాసానికి తీసుకువచ్చారు. అయితే పొరపాటున పడి మరణించి ఉంటారని తిరుపతమ్మ గ్రామస్తులతో నమ్మబలికింది. కానీ పొలంలో ప్రియునితో కలిసి అన్నను హత్యచేసి నీటి కుంటలో వేసి ఉంటారని గ్రామస్తులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

nanireddy

nanireddy

Next Story