ఘోర రోడ్డు ప్రమాదం.. సింగర్‌ కుమార్తె మృతి..

nanireddy
Updated on: 24 Dec 2018 3:07 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. సింగర్‌ కుమార్తె మృతి..
X

ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రముఖ సింగర్ కుమర్తె మృతిచెందింది. ఈ ఘటన కేరళలో జరిగింది. మలయాళ సంగీత దర్శకుడు బాలభాస్కర్ కుటుంబం త్రిస్సూర్‌లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా డ్రైవర్‌ నిద్రమత్తులో కారును చెట్టుకు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన కూమార్తె తేజస్వి అక్కడికక్కడే మరణించింది. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమలోకి 12 ఏళ్ళ వయస్సులో సంగీత దర్శకుడిగా బాలభాస్కర్‌ పరిచయమయ్యారు. అతి పిన్న వయసులో సినీ కెరియర్ ను ప్రారంభించిన బాల స్టేజీ షోలతో సింగర్‌గా, వయోలినిస్ట్‌గా మరింత పాపులర్‌ అయ్యారు.

nanireddy

nanireddy

Next Story