వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత

nanireddy
Updated on: 24 Dec 2018 1:37 PM IST
వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత
X

వైసీపీ సీనియర్ నేత,శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. శనివారం నెల్లూరులో వైసీపీ కార్యక్రమంలో ప్రసంగించిన ఉమ్మారెడ్డి తరువాత దగ్గు, జ్వరంతో నీరసించారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉమ్మారెడ్డిని పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు.

nanireddy

nanireddy

Next Story