రెడ్ మీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

nanireddy
Updated on: 24 Dec 2018 1:23 PM IST
రెడ్ మీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..
X

అభిమానులకు షావోమి బాడ్ న్యూస్ చెప్పింది. అనతికాలంలోనే స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో తానేంటో ప్రూవ్ చేసుకుంది రెడ్ మీ. భారత్ లోని మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్లతో అతితక్కువ ధరతో స్మార్ట్ ఫోన్లు, టీవీలు ప్రవేశపెట్టింది. చైనాలో తయారయ్యే ఈ గాడ్జెట్స్ కు ఇండియాలో మంచి గిరాకీ ఉంది. దాంతో రెడ్ మీ ఉత్పత్తులను ఇండియాలో విస్తరించాలని బుధవారం జరిగిన షావోమి కాన్ఫరెన్స్ లో నిర్ణయించింది. కాగా దీనిపై ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే రెడ్ మీ ఉత్పత్తులైన రెడ్ మీ నోట్ 5 ప్రొ, 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ టీవీ4 ధరలను పెంచేసింది. ఫోన్‌పై రూ.1,000 , టీవీపై రూ.5,000లను పెంచింది. దీంతో పెరిగిన ధరలతో రెడ్‌మి నోట్‌ 5 ప్రొ రూ.13,999, ఎంఐ ఎల్‌ఈడీ రూ.44,999లకు అందుబాటులో ఉన్నాయి.

nanireddy

nanireddy

Next Story