Top
logo

బాలుడు మీద నుంచి వెళ్లిన కారు.. కానీ..(వీడియో)

బాలుడు మీద నుంచి వెళ్లిన కారు.. కానీ..(వీడియో)
X
Highlights

భూమ్మీద నూకలు ఉంటే చాలు మృతువు దాకా వెళ్లినా త్రిగిరావొచ్చు అంటారు. ముంబైలో జరిగిన ఓ ఘటన ఆ సామెతకు ఉదాహరణే. ఓ...

భూమ్మీద నూకలు ఉంటే చాలు మృతువు దాకా వెళ్లినా త్రిగిరావొచ్చు అంటారు. ముంబైలో జరిగిన ఓ ఘటన ఆ సామెతకు ఉదాహరణే. ఓ బాలుడు అపార్టుమెంటులోని పరిసర ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ బాల్ కార్ పార్కింగ్ స్థలంలో పడింది. ఆ కుర్రాడు బాల్ కోసం పరుగెడుతూ కారు దగ్గరికి వెళ్లాడు. బాల్‌ని తన చేతులోకి తీసుకుని ఫ్రెండ్స్‌కి విసిరాడు. ఇంతలో తన షూలేస్ ఊడిపోయాయి. అతను కింద కూర్చుని షూలేస్‌ కట్టుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఓ మహిళ కారును స్టార్ట్‌ చేసింది. అయితే అక్కడ పిల్లాడు ఉన్నాడన్న సంగతిని ఆ మహిళ గమనించ లేదు.. దాంతో అతడి మీదకి కారు ఎక్కించింది. అదృష్టం కొద్ది ఆ పిల్లాడికి చిన్న గాయం కూడా కాలేదు. ఇక ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అదృష్టవశాత్తు బాలుడికి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story