ఆమె అంజలి చెల్లెలు కాదంట

అంజలి చెల్లెలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోందంటూ ఇవాళ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఒక సినిమా,...
అంజలి చెల్లెలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోందంటూ ఇవాళ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను అంటూ ఈ రోజు మీడియా వారికి ఇంటర్వ్యూలు సైతం ఇచ్చిన ఆరాధ్య అనే ఈ ముద్దుగుమ్మ.. ప్రముఖ కథానాయిక అంజలికి అసలు సోదరినే కాదట. దీనిపై తమిళ మీడియా వర్గాలు కథనాలు కూడా ఇస్తున్నాయి.
అంజలికి అక్క మాత్రమే ఉందని, ఆమెకి పెళ్లయి సంతోషంగా కాపురం చేసుకుంటోందని.. అంజలి చెల్లెలంటూ ఆరాధ్య చెప్పుకొస్తున్నది అంతా అబద్ధమేనంటూ ప్రముఖ తమిళ సినీ జర్నలిస్ట్ రియాజ్ కె.అహ్మద్ వివరణ ఇస్తున్నారు. ఆరాధ్యని పరిశీలనగా చూస్తే ఒకటీ అరా పోలికలైతే ఉన్నాయి కానీ చూడగానే అంజలి ఫీచర్స్ అయితే ఎక్కువగా కనిపించడం లేదు.
సో.. ఆ వార్తల్లో నిజముందనే అనుకోవచ్చు. దీనికి సంబంధించి అంజలి నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే రియాజ్ కె.అహ్మద్ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌ని స్మైలీ ఎమోజీతో బదులిచ్చింది అంజలి. అంటే.. ఆరాధ్య తన చెల్లెలు కాదన్న అతని వార్తని నవ్వుతూ ఒప్పుకుందనుకోవాలేమో.
పసుపు వర్ణ శోభితం.. నేటి నుంచి తెలుగుదేశం మహానాడు...
27 May 2022 6:53 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTమోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMT