బీజేపీకి కురువృద్ధుడి షాక్!

బీజేపీకి కురువృద్ధుడి షాక్!
x
Highlights

బీజేపీ జాతీయ రాజకీయాల్లో గుజరాతీలు నరేంద్రమోడీ, అమిత్ షా హవా మొదలయ్యాక.. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శతృఘ్ను సిన్హా, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్,...

బీజేపీ జాతీయ రాజకీయాల్లో గుజరాతీలు నరేంద్రమోడీ, అమిత్ షా హవా మొదలయ్యాక.. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శతృఘ్ను సిన్హా, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ లాంటి వాళ్ల ప్రాభవం తగ్గిపోయిందనే చెప్పాలి. వీళ్లలో కొందరు సర్దుకుపోతూ పదవులు అనుభవిస్తుంటే.. ఇంకొందరేమో ఆత్మాభిమానం కారణంగా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. వృద్ధ నేతల్లో ఒకరైన శతృఘ్ను సిన్హా అయితే.. సందర్భం వచ్చినపుడు పార్టీ వ్యవహార శైలిపై విమర్శలు కూడా చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు.. మరో మెట్టు ముందుకు వెళ్లిన సిన్హా.. అవసరమైతే పార్టీకి గుడ్ బై చెప్పేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో.. ఆయన మరో పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు.. ఆయన అనుచరులే చెబుతుండడంతో.. ఈ మాట నిజమే అని నమ్మాల్సి వస్తోంది. ఈ మధ్య కాంగ్రెస్ ను తరచుగా పొగుడుతూ వస్తున్న సిన్హా.. చిదంబరం, ఇతర నేతల మేధో సంపత్తిని కూడా కీర్తించిన సందర్భాలు ఉన్నాయి.

దీంతో.. ఆయన కాంగ్రెస్ చేరడం ఖాయమే అన్న మాట కూడా వినిపిస్తోంది. కాకుంటే.. యువ శక్తికి ప్రాధాన్యం ఇవ్వాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆలోచనల నడుమ.. బీజేపీ వృద్ధుడు శతృఘ్ను సిన్హా.. ఎలా నెట్టుకువెళ్తారన్నది మాత్రం.. ప్రస్తుతానికి సందేహాస్పదంగా మారింది. మరోవైపు.. ఇన్నాళ్లూ ఎన్ని మాటలు అనుకున్నా కూడా పార్టీలో కొనసాగుతున్న సిన్హా.. సడన్ గా ఎన్నికల వేళ బయటికి వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు.. బీజేపీలో కలకలం సృష్టిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories