logo
సినిమా

'ఖైదీ'గా మారనున్న షకలక శంకర్..

Highlights

'ఖైదీ' అన్న పేరు చిరంజీవిని మెగాస్టార్ ను చేసిందనడంలో సందేహం లేదు. అప్పట్లో ఈ చిత్రం సాధించిన విజయం అంతా ఇంతా ...

'ఖైదీ' అన్న పేరు చిరంజీవిని మెగాస్టార్ ను చేసిందనడంలో సందేహం లేదు. అప్పట్లో ఈ చిత్రం సాధించిన విజయం అంతా ఇంతా కాదు.. అదే స్పూర్తితో మెగాస్టార్ 150వ చిత్రానికి ఖైదీ అన్న టైటిల్ ను యాడ్ చేశారు. ఇప్పుడు అదే టైటిల్ ను కమెడియన్ షకలక శంకర్ చిత్రానికి పెట్టారు. షకలక శంకర్ హీరోగా 'ఖైదీ' చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ భవాని ఫిలింస్‌ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో గొలుసు శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. హనుమాన్‌ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం షూటింగ్ విజయ దశమి కానుకగా మొదలు కానుంది. ఈ సందర్బంగా నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిత్ర టైటిల్ ను తమ చిత్రానికి పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఖైదీ చిత్రం వలె మా చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించడం కాయమన్నారు.

Image removed.

Next Story