logo
సినిమా

ఆ క్రికెటర్ తో షారుక్ కూతురు ప్రేమాయణం?

ఆ క్రికెటర్ తో షారుక్ కూతురు ప్రేమాయణం?
X
Highlights

గతకొద్ది రోజులుగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఐదేళ్లుగా...

గతకొద్ది రోజులుగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఐదేళ్లుగా ప్రేమించుకుని గతేడాది చివర్లో ఒకటయ్యారు.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అంతేకాకుండా మరో క్రికెటర్ కెఎల్ రాహుల్ , హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని పుకార్లు వస్థున్నాయి. అయితే ఈ పుకార్లను రాహుల్ ఖండించాడు. ఈ విషయం మరవకముందే తాజాగా మరో వైరల్ వార్త తెరపైకి వచ్చింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌ యువ క్రికెటర్‌ శుబ్‌మాన్‌ గిల్‌తో ప్రేమలో మునిగితేలుతున్నట్టు రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ల అనంతరం నైట్‌రైడర్స్‌ యువ ఆటగాడు గిల్‌తో సుహానా ముచ్చటించడం అందరి ఆకర్షించింది. ప్రస్తుతం వీరు బయట డిన్నర్లు, పార్టీలకంటూ తిరుగుతున్నారని సోషల్‌ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై షారుక్ ఖాన్ ఖండించకపోవడం గమనార్హం.

Next Story