భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు

nanireddy
Updated on: 24 Dec 2018 1:25 PM IST
భారీ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు
X

బీహార్ లో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. దాదాపు 35 మంది యువతులు ఇందులో పట్టుబడ్డారు. బీహార్ లోని కతిమార్‌లోని గులాబ్‌ బాగ్‌ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీంతో స్థానికులకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బృందాలతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంట్లో దాడులు నిర్వహించారు. బడా వ్యాపారులతో పాటు ఉన్నతవర్గాల పిల్లలు వస్తుంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా త్వరలో వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు.

nanireddy

nanireddy

Next Story