రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం.. సభ రద్దుపై చర్చ..?

nanireddy
Updated on: 24 Dec 2018 2:47 PM IST
రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం.. సభ రద్దుపై చర్చ..?
X

రేపు (సెప్టెంబర్ 2వ తేదీ) తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యి మూడు గంటలకు ముగుస్తుంది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కన్పిస్తోంది. అసెంబ్లీ సమావేశం తేదీ ఖరారుతో పాటు..సభ రద్దుపైనా నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు నేరుగా ప్రగతి నివేదన సభకు వెళ్లనున్నారు. ఐతే.. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కేబినెట్ నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొందరు ఈ సమావేశమే ఆఖరిదై ఉండవచ్చన్న అభిప్రాయం వెలియబుచ్చుతున్నారు.

nanireddy

nanireddy

Next Story