సెల్ఫీ సూసైడ్‌కి పాల్పడిన గురువారెడ్డి కేసులో కొత్తకోణం

nanireddy
Updated on: 24 Dec 2018 1:59 PM IST
సెల్ఫీ సూసైడ్‌కి పాల్పడిన గురువారెడ్డి కేసులో కొత్తకోణం
X

విజయవాడలో సెల్ఫీ సూసైడ్‌కి పాల్పడిన గురువారెడ్డి కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. పరారీలో ఉన్న భార్య , అత్త లిద్దరు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరికోసం పలు బృందాలుగా పోలీసులు విడిపోయి గాలిస్తున్నారు. గురవారెడ్డి భార్య, అత్తింటి వారి కోసం పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తుండగా.. వారు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం ధరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు పరారీలో ఉన్న గురువా రెడ్డి భార్య గాయత్రి, ఇతర కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ అతడి బంధువులు నిరసనకు దిగారు. విజయవాడ స్టేషన్‌ దగ్గర బైఠాయించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నిందితులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు.

nanireddy

nanireddy

Next Story