టెక్నాలజీకి, ఇతిహాసాలకు లింకేంటి? సీతాదేవే తొలి టెస్ట్‌ట్యూబ్‌ బేబీనా?

టెక్నాలజీకి, ఇతిహాసాలకు లింకేంటి? సీతాదేవే తొలి టెస్ట్‌ట్యూబ్‌ బేబీనా?
x
Highlights

ఇతిహాసాలకు, నేటి ఆవిష్కరణలకు కమలనాథులు లింకుపెడుతున్నారు... నేటి సాంకేతిక పరిజ్ణానం, నాడూ ఉందంటున్నాయి వారి మాటలు. ఆధారాల్లేని వ్యాఖ్యలతో రేపటి...

ఇతిహాసాలకు, నేటి ఆవిష్కరణలకు కమలనాథులు లింకుపెడుతున్నారు... నేటి సాంకేతిక పరిజ్ణానం, నాడూ ఉందంటున్నాయి వారి మాటలు. ఆధారాల్లేని వ్యాఖ్యలతో రేపటి తరానికి ఎలాంటి బోధనలు చేస్తున్నారన్న హేతువాదలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడం, పోల్స్‌ పోలరైజేషన్‌ కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

బీజేపీ నాయకులు, ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇలా చాలామంది కాషాయ నేతలు, రామాయణ, మహాభారతాలకు, అందులోని ఘటనలకు ఎవరూ ఊహించని, నిర్వచనాలిస్తూ, పోలికలు తెస్తున్నారు. త్రిపుర సీఎం, యంగ్‌ లీడర్‌ విప్లవ్ కుమార్ దేవ్ పాలనాపగ్గాలు చేపట్టాడని దేశమంతా చాలా ముచ్చటగా చెప్పకుంది. కానీ తర్వాత, ఆయన వివిధ కార్యక్రమాల్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, మాత్రం అందర్నీ విస్తుగొలిపాయి.

సీతాదేవి జననం గురించి, ఇతిహాసాలు తెలిసినవారందరికీ అవగాహన ఉంటుంది. పిల్లల్లేక బాధపడుతున్న జనకమహారాజు, తన పొలంలో యజ్ణం చేస్తాడు. ఎద్దులను కట్టి, పొలం దున్నుతాడు. ఆ టైంలో, భూమిలో ఒక పెట్టే దొరుకుతుంది. అందులో పసికందైన సీతాదేవి ఉంటుంది. ఆ దేవదేవతల వరం, సీత అంటూ జనకుడు సంతోషిస్తాడు. అయితే, సీతాదేవి జననం, కురుక్షేత్ర యుద్ధంలో ప్రయోగించిన అస్త్రాలు, ధృతరాష్ట్రుడికి సంజయుడు వివరించడంపై, నేడు మంత్రులు కొత్త నిర్వచనాలు ఇవ్వడం, దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. నేటి ఆవిష్కరణలకు, నాడు జరిగాయో లేదో చెప్పలేని రామాయణ, మహాభారత ఘటనలకు, లింకు ఎలా పెడతారని హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగా అలాంటి సాంకేతిక పరిజ్నానం ఉండి ఉంటే, మనదేశంలో టెక్నాలజీ ఎందుకు అభివృద్దికాలేదని అడుగుతున్నారు. కేవలం ఎన్నికల్లో పోలరైజేషన్‌కు, యూపీ బైపోల్స్‌లో బీజేపీ ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కమలనాథులు ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారని చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చరిత్రకు వక్రీకరణలు కూడా అందులో భాగమేనని విమర్శిస్తున్నారు.

అయితే, విప్లవ్ దేవ్, దినేష్ శర్మ వ్యాఖ్యానాల ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోరాదని, బీజేపీ నాయకులు చెబుతున్నారు. రామాయణ, మహాభారత కాలంలోనే అంతటి టెక్నాలజీ ఉందని చెప్పడమే వారి కామెంట్ల ఉద్దేశమని వివరిస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో మిసైల్స్, రాకెట్లు, అణ్వస్త్రాలు, వాడారని చరిత్రకారులు కూడా ఆధారాలతో నిరూపించారని కాషాయ నేతలు చెబుతున్నారు. పుష్పకవిమానం, మయసభ, ఇలా ఎన్నో ఆవిష్కరణలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన పూర్వీకులు గొప్ప దార్శనికులని చెప్పడానికి, నిదర్శనాలని, ప్రపంచానికి జ్ణానం అందించింది భారతదేశమేనని వారంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories