కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం..

nanireddy
Updated on: 24 Dec 2018 2:02 PM IST
కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం..
X

చెన్నైలో విషాదం నెలకొంది. నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన పాత మహాబలిపురం కందన్‌చావడిలో జరిగింది. కందన్‌చావడి ఓ భవన నిర్మాణం సందర్భంగా.. 45మంది కూలీలు పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 8గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న
ఆ భవనం స్తంభాలు కుప్పకూలినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిలో తొలుత ఐదుగురిని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం సహాయక బృందాలు అక్కడికి చేరుకొని మిగతా వారిని బయటకు తీశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 23 మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసినట్టు కాంచీపురం జిల్లా కలెక్టర్‌ పొన్నయ్య తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు.. 41మంది కూలీలు ఉన్నారు. 17మందికి తీవ్రగాయాలు కాగా... వారిలో ఐదుగురికి తలకు తీవ్రగాయాలు కావడంతో.. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.

nanireddy

nanireddy

Next Story